Wednesday, March 4, 2026
Homeమహబూబ్‌నగర్‌MLA Megha Reddy | ఆటో యూనియన్ సంఘానికి అండగా ఉంటా.

MLA Megha Reddy | ఆటో యూనియన్ సంఘానికి అండగా ఉంటా.

  • ఎమ్మెల్యే మేఘా రెడ్డి..

వనపర్తి లోని రాజీవ్ ఆటో యూనియన్ సంఘం సభ్యులకు తను ఎప్పుడు అండగా ఉంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి భరోసా కల్పించారు. ఆదివారం వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో యూనియన్ నాయకులు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధ్యక్షులు, కార్యదర్శిలకు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ఆటో యూనియన్ సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయింపునకు, భవన నిర్మాణానికి సైతం తను పూర్తిస్థాయిలో సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులు, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, సంఘం అధ్యక్షులు హుస్సేన్, ఉపాధ్యక్షులు తిరుపతి, రసూల్, దుర్గేష్, కోశాధికారి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పరమేష్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News