Wednesday, February 11, 2026
Homeమహబూబ్‌నగర్‌Mahabubnagar Mla | సదర్ ఉత్సవాల్లో శాసన సభ్యుడు

Mahabubnagar Mla | సదర్ ఉత్సవాల్లో శాసన సభ్యుడు

మహబూబ్‌నగర్ సిటీ(Mahabubnagar City)లోని గడియారం చౌరస్తా (Gadiyaram Chourastha) వద్ద వైభవంగా నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో (Sadar Celebrations) మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పాల్గొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర ఆచారం మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు. ప్రజల విశ్వాసాలను, సాంప్రదాయాలను కాపాడుతూ ఇలాంటి ఉత్సవాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి(Inspiration)గా నిలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవాల ప్రత్యేక ప్రదర్శనలను వీక్షించారు.

ఉత్సవ ప్రాంగణాన్ని అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందించారు. మహబూబ్‌నగర్ సాంస్కృతిక వైభవం ఇలాగే కొనసాగుతూ తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి.వెంకటేష్, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, శాంతన్న యాదవ్, గోపాల్ యాదవ్, రాములు యాదవ్, రమేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, చుక్క యాదయ్య యాదవ్, చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News