Monday, January 19, 2026
EPAPER
Homeఆదిలాబాద్Vivek | వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వివేక్

Vivek | వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వివేక్

కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్(Minister Vivek).. జైపూర్, భీమారం, కోటపల్లి మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల (Kasturba Gandhi Girls Junior College) నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. రూ.2.50 కోట్ల సమగ్ర శిక్ష (Samagra Siksha) నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధిపై దృష్టిసారించి ఉన్నత విద్యను అందిస్తుందని పేర్కొన్నారు. గంగారం గ్రామంలో రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టు(Gollavagu Project)లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప (Fish) పిల్లలను విడుదల చేశారు.

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తోందని చెప్పారు. గొల్లవాగు ప్రాజెక్టును తన తండ్రి కాకా వెంకటస్వామి (Kaka Venkataswami) కట్టించారని చెప్పారు. జూబ్లీహిల్స్‌(JubileeHills)లో మాత్యకారులు కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి మద్దతిచ్చారని తెలిపారు. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీ అందరి కోసం భీమారంలో సొసైటీ భవనాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

ఫిష్ మార్కెట్, విద్యుత్ లైన్స్ కావాలని, చెరువు పూడిక తీత, చెరువులో చెట్ల తొలగింపు చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అదే గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News