- ఏజన్సీ ఏరియా… అందాలను తిలకిస్తూ… ఫోటోగ్రఫీలో భందిస్తున్న భక్తులు
మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో “ప్రకృతి” అందాలను కళ్ళతోచూడటం!.. చెవులతో వినడం!!.. మనసుతో నవ్వడం!!! ఈ మూడు మన మనసుకు అందమైన “ప్రశాంతి”ని ఇస్తుంది.జాతర కు వచ్చే పట్టణ వాసులు అసలు “ప్రకృతి” అంటే ఏమిటి అది ఎలా ఉంటుందన్న ఆసక్తి తో తెలుసుకుందాం..అని మేడారం పరిసరాల్లో కలియతిరుగుతూ కొన్ని చోట్ల ప్రకృతి ఏర్పరిచిన కనువిందు అందాలను తమ తమ కెమెరాల్లో..మొబైల్ లలో భందించి ఆనందించారు.


ఆపై సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకున్నారు.అసలు ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న చెట్లు, పువ్వులు, మొక్కలు, జంతువులు, ఆకాశంలోని సూర్య-చంద్రులు, ఎత్తైన కొండలు దట్టమైన అడవులు, జలజల పారే జలపాతాలు ఉప్పొంగే సముద్రాలు నదులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ప్రకృతి అందాలు మనం చూసే ప్రతిదానిలో ప్రకృతి అందం రూపొందించబడింది మనిషి జీవించడానికి ప్రకృతిపై ఎప్పుడు ఆధారపడుతూనే ఉంటాం ఆ ప్రకృతి మనకు ఆక్సిజన్ రూపంలో శ్వాస తీసుకొని మనం బ్రతకడానికి దోహదపడుతుంది. భూమిని అందంగా తీర్చిదిద్దే అనేక రంగులను ప్రకృతిలో చూస్తూ ఉంటాం మన చుట్టూ ఉండే ప్రకృతి సౌందర్యాన్ని జాతర భక్తులు,యాత్రికులు, పర్యాటకులతో పాటు ఇప్పుడు మనం కూడా ఆస్వాదిద్దాం!.

