మానవాళికి ఏసు శాంతి సందేశం స్ఫూర్తిదాయకం
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఘన స్వాగతం పలికిన నిర్వహకులు..
వికలాంగులకు నిత్యావసరాలు, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ
శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు(Teachings of Christ) సర్వమానవాళికి ఆదర్శనీయమని, అనుసరణీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్(Medak Parliament Congress Party In-charge) నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని(Christmas Day) పురస్కరించుకొని చిట్కుల్ పరిధిలోని బ్యులా, ఎంవీ చర్చిల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి, ప్రత్యేక ప్రార్థనల్లో(Special Prayers) పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులతో కలిసి వికలాంగులకు నిత్యావసరాలను, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ(Distribution of Essential Commodities) చేశారు. ఈ సంధర్బంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. మానవుడిగా ప్రజల మధ్యనే నడయాడి సమాజానికి శాంతి సందేశం అందించిన దయామయుడు యేసుక్రీస్తు అని పేర్కొరు.

క్రీస్తు చూపిన శాంతి మార్గం సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, దయా గుణాలు కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బ్యూలా చర్చి నిర్వాహకులు ప్రకాష్ రావు, రాజ్యలక్ష్మి, ఎంవీ చర్చి నిర్వాహకులు శ్రీమాన్, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకుడు రవి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, రజక సంఘం రాష్ట్ర నాయకుడు సీహెచ్ వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు గోపాల్, రాజ్ కుమార్, గౌరి శంకర్, అనిల్, నిర్వాహకులు, క్రైస్తవ నాయకులు, సోదర, సోదరీమణులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
