Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Manobandhu | "మనో బంధు" సమాజ ఆత్మబంధువు!

Manobandhu | “మనో బంధు” సమాజ ఆత్మబంధువు!

  • జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ

మనో వైకల్యం, మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్న వారికి మనో బంధు ఫౌండేషన్ ఆత్మ బంధువుగా ఉన్నదని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. జాతీయ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు రామకృష్ణం రాజు ఆధ్వర్యంలో పని చేస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది అనాథ మానసిక రోగులను ఆదుకుందని కేఎస్ఆర్ గౌడ అన్నారు.

హైదరాబాద్లోని బేగంపేటలోని చికోటి గార్డెన్స్ లో ఉన్న జీవన్ జ్యోతి సంస్థలో శనివారం జరిగిన తెలంగాణ శాఖ సమావేశంలో అతిథిగా హాజరై ప్రసంగించిన కేఎస్ఆర్ గౌడ “మనుష్యులను ప్రేమిద్దాం – గౌరవంగా బతకనిద్దాం” అనే విధంగా అందరూ ప్రవర్తిస్తే సమాజంలో అనేక సమస్యలకి పరిష్కారం లభిస్తుందని అన్నారు.

- Advertisement -

పుట్టుకతో మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారే కాకుండా సామాజిక, ఆర్థిక, మానసిక కారణాలతో కూడా మానసిక రోగులుగా మారిన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వాలదని ఆయన తెలిపారు. అలాగే మనో బంధు ఫౌండేషన్ చేసే ప్రతి కార్యంలో జై స్వరాజ్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.

ఇళ్లు లేని మనో వైకల్యంతో బాధపడుతున్న రోగుల బాధలు వర్ణనాతీతం అని మనో బంధు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణం రాజు అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో సేవాకార్యక్రమాలు చేపడుతున్నామని, తమకు సహకరించాలని అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ రోగులకు ప్రభుత్వాలు సేవ చేయడానికి అనువైన చట్టాలు చేయాలని రాజు కోరారు. ఈ కార్యక్రమంలో భూమిక తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News