Homeరంగారెడ్డిCampaign | 18వ వార్డును ఆదర్శంగా తీర్చి దిద్దుతా..

Campaign | 18వ వార్డును ఆదర్శంగా తీర్చి దిద్దుతా..

  • కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చేగురి అరుణ రామకృష్ణ గౌడ్

ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటానని, 18వ వార్డు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చేగురి అరుణ రామకృష్ణ గౌడ్ హామీ ఇచ్చారు. శనివారం జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలుకరించి వారి అమూల్యమైన ఓటును అభ్యర్థించారు. ప్రజల మద్దతు కోరారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరించారు. తనపై నమ్మకం ఉంచాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ..

Congress Campaign in Ward 18 Peddamangalar1

ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, వాటికి ప్రాధాన్యంగా పరిష్కారం చూపుతానని స్పష్టం చేశారు. పెద్దమంగళారంలోని 18వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి తనకు సేవ చేసే అవకాశం కల్పించాలని చేగురి అరుణ రామకృష్ణ గౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో చేవెళ్ల పీసీసీ నాయకులు గౌరీ సతీష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, నిరంజన్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News