Monday, October 27, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | అవినీతి రారాజుపై వేటు పడేనా..?

Corruption | అవినీతి రారాజుపై వేటు పడేనా..?

  • ఖాళీ స్థలాలకు అసెస్మెంట్ ఇంటి నెంబర్లు ..
  • భవన అనుమతులకు ఒక రేటు అనుమతి లేని నిర్మాణానికి మరో రేటు..
  • తూంకుంట మున్సిపల్లో ఏసీబీ అధికారుల తనిఖీలలో తప్పించుకున్న ఘనుడు శ్రావణ్..
  • ఒక్కో పైల్ కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి తన కింద స్తాయి సిబ్బంది ద్వారా వసూల్..
  • దొరికితే బలయేది బిల్ కలెక్టర్లు నా తప్పేం లేదు వాళ్ళని జైలుకు పంపండి అంటాడు…
  • దొరికితే దొంగ లేకపోతే దొర.. గిదే మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపల్ మేనేజర్ శ్రావణ్ బాగోతం…
  • ఆదాబ్ హైదరాబాద్ పత్రికకు వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్..

తూంకుంట మున్సిపల్ పరిధిలో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట వేసిన మేనేజర్ శ్రావణ్ కుమార్ పై ‘తూంకుంట మున్సిపల్ నా అడ్డా’ అనే కథనాన్ని ప్రచురించింది. దీనిపై రియాక్ట్ అయిన తూంకుంట మున్సిపల్ కమిషనర్ మేనేజర్ శ్రావణన్ను కాపాడేందుకు ఈ విధంగా రిజాయిండర్ ఇచ్చారు.. తూంకుంట మున్సిపల్ మేనేజర్ శ్రవణ్ కుమార్ ఎలాంటి అవినీతి ఆరోపణకు పాల్పడలేదు.. ఓ అధికారిపై ఆరోపణలు వచ్చిన విషయంలో ఎలాంటి వివరణ తీసుకోకపోవడం సరైంది కాదని తెలియజేశారు. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మేనేజర్ శ్రావణ్ కుమార్ కు ఆదాబ్ హైదరాబాద్ పత్రిక జిల్లా ప్రతినిధి ఫోన్ ద్వారా సంప్రదించగా తాను నాకేం తెలియదు రెగ్యుకరైజేషన్ లాంటివి ఏమీ కూడా పెండింగ్ లో లేవు అనే వివరణ ఇచ్చారు..

ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది.. మేనేజర్ శ్రావణ్ తూంకుంట మున్సిపల్ కు వచ్చి ఐదేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు బదిలీ అనేది లేదు. పైగా ఆదాబ్ ప్రచూరించినట్టు అన్ని విభాగాలు అంతా తానే మైంటైన్ చేస్తాడు అనడానికి సాక్షాత్తు సాక్షాధారాలతో సహా చేస్తాడు అనడానికి సాక్షాత్తు సాక్షాదారాలతో సహా రీజాయిండర్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్.. ఏ విభాగంలో ఏ పని కావాలన్నా ఇతగాడిని కలవాల్సిందే లేదంటే ఆ ఫైల్ అలా ఉండాలి.. కాదు కూడదని కమీషనర్ కలుస్తా అంటే ఇక మీ పని గోవింద. ఇదే అంశంపై ఉన్నది ఉన్నట్టు ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ప్రచురణ పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.. తూంకుంట మున్సిపల్ పరిధిలోకి రెవెన్యూ విభాగం నుంచి 2023లో 8 మంది అధికారులు వచ్చారు.. అందులో 6 మంది తిరిగి రెవెన్యూ శాఖకు వెళ్లగా.. మరో ఇద్దరు ఇక్కడే ఉండిపోయారు..

అందులో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయింది.. తనతో పాటు పని చేస్తున్న మరో వ్యక్తి ఫైల్ అధికారులకు పంపి ఈ మహిళ ఫైల్ పంపకుండా ఆపినట్టు ఆధారాలు ఉన్నాయి.. తనను రెగ్యులరైజ్ చేయాలంటే మేనేజర్ శ్రావణ్ కుమార్ మేనేజ్ చేయాల్సిందే..ఇలాంటి
ఆధారాలు స్వీకరించిన ప్పటికీ కూడా ఇతగాడిపై ఎలాంటి చర్యలు లేవు.. మేనేజర్ శ్రావణ్ కుమార్ అడ్డా తూంకుంట మున్సిపల్ గడ్డ అని మరోసారి రుజువైంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News