Tuesday, October 28, 2025
ePaper
HomeరాజకీయంMallu Ravi | జూబ్లీహిల్స్‌లో మల్లు రవి ప్రచారం

Mallu Ravi | జూబ్లీహిల్స్‌లో మల్లు రవి ప్రచారం

ప్రజల కోసం పనిచేసే పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని వెల్లడి
నవీన్ యాదవ్ తరఫున శక్తి అభియాన్ బృందం సైతం రంగంలోకి

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHill By-Election)లో కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) నవీన్ యాదవ్‌(Naveen Yadav)కు మద్దతుగా శక్తి అభియాన్ బృందం (Shakti Abhiyaan Group) విశేషంగా ప్రచారం నిర్వహించింది. హైదరాబాద్ కోఆర్డినేటర్ మెర్సీ ప్రియాంక ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ కోఆర్డినేటర్లు రాచెల్ మెథారి, శ్రీవిద్య, ఆగ్నెస్ రీవ్స్ చురుకుగా పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి (MP Mallu Ravi) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలను గుర్తుగా చూసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైనంని అన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక శాతం విద్యావంతలు ఉన్నారని, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని కావాలన్న కోరికతో ప్రజలు ఉన్నారని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్టుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలను చైతన్యం చేయాలనే సంకల్పంతో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతం నిర్ణయాలు తీసుకున్నారని మల్లు రవి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి దిశగా కృషి చేస్తారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News