Friday, March 6, 2026
HomeజాతీయంMallikarjuna Kharge | అమెరికా వాణిజ్య ఒప్పందం భారత్ కు దెబ్బ

Mallikarjuna Kharge | అమెరికా వాణిజ్య ఒప్పందం భారత్ కు దెబ్బ

  • మన వ్యవసాయాన్ని ముంచేయడం ఖాయం..
  • వస్త్ర పరిశ్రకు కూడా కోలుకోలేని నష్టం..
  • ఎక్స్ వేదికగా మల్లికార్జున ఖర్గే విమర్శలు

భారత్ అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందం భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, రైతులు, పశువులు, వస్త్ర రంగాన్ని బలహీనపరుస్తుందని ఆయన ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని ఆయన ప్రజా సంబంధాల ద్రోహంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 9న విడుదలైన వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ఫిబ్రవరి 6న భారత్- అమెరికా సంయుక్త ప్రకటనలో చేర్చని షరతులను వెల్లడించిందని ఖర్గే ఎత్తిచూపారు.

రష్యా చమురు నిలిపివేయడానికి భారత్ నిబద్ధతను ప్రదర్శించడం వల్లే అదనంగా 25 శాతం సుంకాల్ని తొలగించినట్లు అమెరికా ప్రకటన పేర్కొంది. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేనని ఖర్గే తీవ్రంగా విమర్శించారు. రత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కేంద్రాన్ని అడిగినప్పుడు రష్యా చమురును నిలిపివేస్తున్నట్లు తమకు చెప్పలేదని ఖర్గే అన్నారు. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా ట్వీట్ ద్వారా ప్రకటించాడు.

- Advertisement -

రష్యన్ ఫెడరేషన్ చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారతదేశ నిబద్ధతను అదనపు 25 శాతం సుంకాన్ని తొలగించడానికి ఒక షరతుగా జాబితా చేసినట్లు వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ స్పష్టంగా చెప్పింది. దీన్నిబట్టి చూస్తే భారతదేశ సార్వభౌమత్వాన్ని హరించడానికి మోదీ ప్రభుత్వం అంగీకరించింది ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఒప్పందం వల్ల భారతదేశ వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. పప్పుధాన్యాలు, జన్యుపరంగా మార్పు చేసిన (జిఎం) ఫీడ్, ఎండిన డిస్టిలర్ల ధాన్యాలు (డిడిజిలు) అంటే మొక్కజొన్న, సోయాబీన్స్..

ఇక పశు గ్రాసం కోసం ఎర్రజొన్నలను కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటట్టు సైలెంట్గా ఇందులో చేర్చారని ఖర్గే ఆరోపించారు. దీని ఫలితం రెండు కోట్ల రైతులు, పశువుల పెంపకందారులు నష్టోపోవచ్చని ఖర్గే హెచ్చరించారు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా.. ఒక ప్రభుత్వం మన వ్యవసాయాన్ని విదేశీ వస్తువులకు తలుపులు పూర్తిగా తెరిచింది. ఈ ఒప్పందంలో అదనపు ఉత్పత్తులు అంటే.. అర్ధం ఇదే.

ఈ విషయం మనకు తెలుసు. ఫిబ్రవరి 9న కొత్తగా విడుదల చేసిన వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ‘పల్స్’ అనే పదాన్ని సైలెంట్గా జోడించింది. అయితే ఫిబ్రవరి 6, 2026న జారీ చేసిన భారత్ ? అమెరికా సంయుక్త ప్రకటనలో ఇవి లేవు. మరోవైపు బంగ్లాదేశ్ అమెరికా పత్తి దిగుమతులకి సున్నా శాతమే పన్నులు విధించగా.. భారత్ 18 శాతం పన్నులు విధించడాన్ని ఖర్గే విమర్శించారు.

18 శాతం పన్నులు విధించడాన్న పెద్ద విజయంగా మోడీ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఖర్గే ఆరోపించారు. అమెరికా భారత రైతుల కంటే బంగ్లాదేశ్ను ప్రోత్సహించి.. తన సొంత లాభాలను కాపాడుకుంది. తిరుపూర్, సూరత్ వంటి వస్త్ర కేంద్రాలు 18 శాతం పన్నుల పరిధిలోకి రావడంతో భారతీయ వస్త్ర రంగానికి డబుల్ దెబ్బ తగిలింది. జాతీయ ప్రయోజనాలను, ఎగుమతి ఇంజిన్ను త్యాగం చేసే ప్రజా సంబంధాల ద్రోహమా అని ఖర్గే ఎక్స్ పోస్టులో ప్రభుత్వాన్ని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News