మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కొండ నుండి ఇటీవల బండరాయి విరిగిపడడంతో ప్రధాన రోడ్ పై అంతరాయం ఏర్పడి వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజుల నుండి పనులు కొనసాగుతున్న ఇంకా పూర్తి కానందున గురువారం జిహెచ్ఎంసి, హైడ్రా అధికారులతో కలిసి పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో 12 లక్షల రూపాయలతో పనులు వేగంగా జరుగుతున్నాయని పది రోజుల్లో పనులు పూర్తవుతాయని, ప్రజలకు రోడ్డు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు వైనాలప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఫరీద్, ముత్యం, యాదగిరి, పరమేష్ , హిల్ టాప్ సాయి, విక్కీ, శ్రీకాంత్ యాదవ్, హరి శంకర్, యాదగిరి, సంజీవ, తో పాటు కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
