Wednesday, December 10, 2025
EPAPER
Homeఆరోగ్యంPains | మోకాళ్లు ఎందుకు నొస్తాయంటే..

Pains | మోకాళ్లు ఎందుకు నొస్తాయంటే..

కొంత మందికి యుక్త వయసులోనే మోకాళ్ల నొప్పులు (Knee Pain) వస్తాయి. దీనికి కారణం.. పటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ (Patellofemoral Pain Syndrome) తప్ప కీళ్లు అరిగిపోవటం కాదు. దెబ్బలు (Blows) తగిలినా, ఎక్కువగా వాడినా (Over Usage) కూడా మోకాలి నొప్పికి దారితీస్తుంది. మోకాలి చిప్ప సహజంగా తొడ ఎముక గాడిలో సెట్ అయి ఉంటుంది. అందువల్ల ఆ ఎముక(Bone)కు తగ్గట్లు కదులుతుంది. మెట్లు (Steps) ఎక్కటం, దిగటం, మోకాళ్ల మీద కూర్చోవటం (Sitting) వల్ల కూడా నొప్పి బారినపడతారు.

ఈ నేపథ్యంలో నొప్పికి కారణమైన పనులు (Works) చెయ్యటం మానేస్తే సరిపోతుంది. ఉదాహరణకు మెట్లు ఎక్కటం, దిగటం వల్ల నొప్పి వస్తుంటే లిఫ్ట్‌(Lift)లో వెళ్లితే సరిపోతుంది. రెండు మూడు గంటలకోసారి ఐస్ (Ice) పెట్టుకున్నా నొప్పి నుంచి ఉపశమనం (Relief) పొందొచ్చు. నొప్పి తగ్గించే ట్యాబ్లెట్లు (Tablets) వేసుకోవచ్చు. ఆయింట్‌మెంట్ రాసుకోవచ్చు. ఇలా పది రోజులు చేసిన తర్వాత కూడా నయం కాకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News