మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ కార్యాలయం(Bjp Office)లో నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల(Municipal Elections) సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ ఎంపీ(Mahabubnagar MP) డీకే అరుణ హాజరయ్యారు. మునిసిపల్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా(Draft Voter List)లోని పొరపాట్లను ఎన్నికల అధికారుల(Election Officials) దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మోదీ(PM Modi) ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. యువత, విద్యావంతులు బీజేపీ వైపు చూస్తున్నారని. పార్టీ కోసం మరింత బలంగా పనిచేస్తే గెలుపు తథ్యమని భరోసా వ్యక్తం చేశారు.
DK Aruna | మునిసిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

