మహబూబ్ నగర్ ఎమ్మెల్యే(Mahabubnagar MLA) క్యాంప్ ఆఫీసులో స్థానిక శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) గురువారం పలు సంఘాల డైరీలను(Diaries), క్యాలెండర్ల(Calendars)ను ఆవిష్కరించారు. నూతన సంవత్సరాన్ని(New Year) పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన సంవత్సరం 2026 ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని, మహబూబ్‌నగర్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మునిసిపల్ కార్మొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
- Advertisement -
