మహబూబ్‌నగర్(Mahabubnagar) పట్టణంలోని పద్మావతి కాలనీలో జరిగిన మహా పడిపూజ(Maha Padipuja)లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి(Ayyappa Swami) అనుగ్రహంతో మహబూబ్‌నగర్ జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి మహిమతో మనసులన్నీ ఒక్కటవుతాయని చెప్పారు. 41 రోజుల దీక్షతో మాలధారణ(Maladharana) చేసిన ప్రతి వ్యక్తి అయ్యప్ప స్వామి స్వరూపమేనని తెలిపారు. నియమం, నిష్ఠ, సమానత్వ భావనలతో సన్మార్గంలో నడిపించే ఈ దీక్ష యువతకు ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో TPCC ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, DCC ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అయ్యప్ప భక్త సమాజం భగవంత్ రెడ్డి గురుస్వామి, పంబ రాజు గురుస్వామి, ఆలయ కమిటీ ప్రతినిధులు, దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
Yennam | అయ్యప్ప దీక్ష.. యువతకు ఆదర్శం..
- Advertisement -
RELATED ARTICLES
