- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.
- లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా మద్యం దుకాణాల ఎంపిక
- సూర్యాపేట జిల్లాలో 93 షాపులు లక్కీ డ్రా ద్వారా ఎంపిక.
- 93 మద్యం దుకాణాలకు 2771 టెండర్ల దాఖలు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను పారదర్శకంగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్కీ డ్రా అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. 2025- 27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 93 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 27 షాప్ లు, ఎస్సీ లకు 10 షాప్ లు, ఎస్ టి లకు చెందిన 3 షాప్ లు రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని వెల్లడించారు.
సెప్టెంబర్ 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టామని, దరఖాస్తులు అక్టోబర్ 23 వరకు స్వీకరించామని తెలిపారు. మొత్తం 2771 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. లక్కీ డ్రా లో మద్యం షాపులు పొందిన వారు డిసెంబర్ 1 వ తేదీ నుండి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు నిర్వహించవచ్చని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వ హించాలని ఆదేశించారు. మద్యం షాపులు పొందిన వారు నిర్దేశించిన సమయంలో గా లైసెన్స్ ఫీజు చెల్లించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మానాయక్, ఎక్సైజ్ సి ఐ లు మల్లయ్య, శంకర్, నాగార్జునరెడ్డి, రజిత, స్టీఫెన్ సన్, ఎస్ ఐ లు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
భార్యాభర్తలను వరించిన అదృష్టం.
సూర్యాపేట : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తీసిన మద్యం టెండర్ల డ్రాలో భార్యాభర్తలను అదృష్టం వరించింది. జిల్లాలో 93 దుకాణాలకు 2771 దరఖాస్తులు చేసుకోగా, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డ్రా పద్ధతిలో దుకాణాలను ఎంపిక చేశారు. వీటిలో వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్ కు గెజిట్ నెంబర్ 21లో ఆయన భార్య శ్రావణికి గెజిట్ నెంబర్ 13 లో షాపులు దక్కించుకున్నారు. వందల టెండర్లలో భార్యాభర్తలకు షాపులు దక్కడంతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
