- రాష్ట్ర మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు.
పెద్దపల్లి జిల్లా మంధని టౌన్ లోని మదన పోచమ్మ దేవాలయం సమీపాన కుమ్మర సంఘం భవనానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి నాలుగు గుంటలకు పైగా స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి 20 లక్షలు మంజూరు చేస్తున్నట్టగా ప్రకటించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం మంతిని మండల అధ్యక్షులు రేపాక శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కటినపల్లి రవిందర్, ప్రదాన కార్యదర్శి రేపాక శంకర్, కోశాధికారి ఇందారపు సదయ్య ముఖ్య సలహాదారులు దుబ్బాక ఓదెలు, కార్యనిర్వాహక అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యుల కృషి ఫలితంగా, మండల కుమ్మర సంఘ భవన నిర్మాణానికి రాష్ట్ర మంత్రి చేతులమీదగా శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కుమ్మర్ల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘానికి తోడ్పాటు నందిస్తున్న మంతని మండల అధ్యక్ష, కార్యదర్శులకు, వారి సహచర కార్యవర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర కుమ్మరసంఘం తరపున పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే మంతని మండల కుమ్మర బందువులందరికి ప్రత్యేక అభినందలు తెలియ చేశారు.

