- సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ
- సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి ఏమ్మెల్యేగా రెండు పర్యాయలు గెలిచి ఎలాంటి స్వార్ధం లేకుండా నిస్వార్ధంగా జీవించిన వ్యక్తి కామ్రేడ్ కొండిగారి రాములు అని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు.
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం మాజీ ఏమ్మెల్యే కామ్రేడ్ కొండిగారి రాములు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్బంగా సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల సమితి ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి ఫెజ్ 3 భూ పోరాట కేంద్రంలో అయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.
ఈ సందర్బంగా ఆందోజు రవీంద్ర చారీ మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిచినా వాళ్లే ఆస్తులు కూడా బెట్టుకుంటున్న కాలంలో చిన్నప్పటి నుండే కమ్యూనిస్టు బావాలు కలిగి రెండు సార్లు ఏమ్మెల్యే గా పని చేసిన కూడా ఎలాంటి ఆస్తులు పోగు చేయకుండా కేవలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటు పడ్డారని అన్నారు.

ఎమ్మెల్యే అయిన కూడా బస్సుల్లో ప్రయాణం చేసి సైకిల్ తొక్కి సాధారణ జీవితం గడిపిన నిరుపేదల నాయకుడు రాములు అని, తను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఎన్నో తండలకి రోడ్లు వేసి కరెంట్ సదుపాయం కల్పించారాని గుర్తు చేశారు. నేటితరం యువత కొండిగారి రాములు గురించి తెలుసుకోవాలని వెనకబడిన కులాలపైన జరిగే దాడులని ఖండిస్తూ కుల వివక్షకి వ్యతిరేకంగా కూడా కొండిగారి రాములు పోరాటం చేశారాని గుర్తు చేశారు. ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ కొండిగారు రాములు తన బాల్యలో కూడా తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో తన వంతు పాత్ర పోషించరాని.
బ్రతికినంత కాలం కమ్యూనిస్టు భావాలతోనే ప్రజల కొరకే జీవించారాని, నేడు కోట్ల రూపాయల సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్న ప్రస్తుత ప్రజా ప్రతినిధులు రెండు సార్లు ఏమ్మెల్యే అయినా కూడా అత్యంత సాధారణ జీవితం గడిపిన కొండిగారి రాములు జీవితాన్ని ఆదర్శంగ తీసుకోని ప్రజల శ్రేయస్సుకి పాటు పడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా, సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్, బిఓసి జిల్లా కార్యదర్శి ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు అరుణ, సిపిఐ నాయకులు నవనీత, మధు, రాములు, గణేష్, యాదగిరి, నిరంజన్, గోపి, వీరేష్, శ్రీధర్ రెడ్డి, నీలా, వీణ,కావేరి, రేణుక, మరియు తదితరులు పాల్గొన్నారు.
