Wednesday, March 25, 2026
Homeరంగారెడ్డిAccident | బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి

Accident | బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి

అతివేగంగా బైక్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సిఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన కృష్ణ (38), జ్యోత్స్న (16) బైక్‌పై చీర్యాల నుండి బొమ్మలరామారం వెళుతుండగా కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన కారు బైక్‌ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్‌ను కీసర పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News