Wednesday, April 22, 2026
HomeతెలంగాణKalvakuntla Sanjay | చిల్లర కుట్రలు చేసి సభను ఆపలేరు..

Kalvakuntla Sanjay | చిల్లర కుట్రలు చేసి సభను ఆపలేరు..

  • కల్వకుంట్ల సంజయ్ హెచ్చరిక

కేసీఆర్‌ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్ని చిల్లర కుట్రలు చేసినా.. కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయితదని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో కేసీఆర్ సభ ఏర్పాట్లను కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగిత్యాల సభకు జనం రావద్దని బ్రిడ్జి కూల్చారని మండిపడ్డారు. మేం నిలదీయడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారని తెలిపారు. లక్షలాదిగా జనం జగిత్యాలకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులు సహకరించాలని కోరారు.

కేసీఆర్‌ను చూస్తే ప్రజలకు ధీమా అని కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కరోనా టైమ్‌లో కూడా కేసీఆర్‌ను టీవీలో చూస్తే ప్రజలకు భరోసా వచ్చేదని తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలనపై తూటాల్లాంటి కేసీఆర్ మాటలు వినాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News