Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | ఇదిగో అవినీతి.. ఎక్కడ ఏసీబీ..?

Corruption | ఇదిగో అవినీతి.. ఎక్కడ ఏసీబీ..?

సర్వే నెంబర్ 199 లో వెలసిన అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూమి

  • కాప్రా మండలంలో అవినీతి అధికారులపై కేసులో అరెస్ట్‌ ఎక్కడ..?
  • ప్రభుత్వ భూమిని ప్రైవేటుపరం చేయటానికి పూనుకున్న అధికారులు..
  • ఏకంగా రికార్డులను తారుమారు చేసిన ఘనులు వీరు..
  • ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌..?
  • అధికారులు అక్రమాలు చేసింది వాస్తవమే అని తేల్చి చెప్పిన ఆర్డీఓ..
  • ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములుగా మార్చిన నాటి సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ పై వస్తున్న అరోపణలు..
  • అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌.

అక్కడ అవినీతి జరిగింది.. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.. విచారణాధికారి తనపని తాను చేసుకుపోయారు.. కొందరు అధికారులు అవినీతి చేశారని ఆయన తేల్చేశారు.. ఇంతవరకు బాగానే ఉంది.. మరి ఇప్పటివరకు ఆ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కబెడుతున్నారో అర్ధం కావడం లేదు.. కాగా తూ తూ మంత్రంగా ఒక ఏడీని అదుపులోకి తీసుకున్నారు.. చేతులు దులిపేసుకున్నారు.. కళ్లెదుటే అధికారులు రికార్డులు తారుమారు చేసి కబ్జాలను ప్రోత్సహించారన్న వ్యవహారంలో అవినీతి అధికారుల పై కేసులు నమోదైన అక్రమాలు చేసినట్లు కాదా..? నేటి వరకు అవినీతి అధికారుల పై శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడంలో మతలబెంటి..? అసలు ఏమి జరుగుతోంది..?

ఇదంతా కాప్రా మండలంలో చోటుచేసుకుంది.. ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ పరం చేయడానికి నానా యాతన పడుతున్న అవినీతి ధికారులు భాగోతం బయటపడిరది.. కాగా ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేస్తూ అక్రమాలకు ఆజ్యం పోసిన వ్యవహారాల వెనుక అవినీతి సామ్రాట్‌ గా పేరు గడిరచిన నాటి సి సి ఎల్‌ ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఉన్నారని తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. మరి అందుకే ఈ కేసును నీరుగారుస్తున్నారని, ఒకరిని అరెస్ట్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఏసీబీ దీనిపై దృష్టి సారించి, అవినీతి అధికారులను శిక్షించి విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు..

- Advertisement -

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, కాప్రా మండల శివారులో సర్వేనెంబర్‌ 177 ను బూచిగా చూపిస్తూ సర్వే నెంబర్‌ 199లో ప్రభుత్వ భూమిని కబ్జా చేయుటకు నకిలీ పత్రాలు సృష్టించారు కొందరు కబ్జా కోర్లు.. ప్లాట్‌ నెంబర్‌ 126 నుండి 129, ఫ్లాట్‌ నెంబర్‌ 139 నుండి 144 వరకు ప్లాట్‌ నెంబర్‌ 152 నుండి 158 వరకు, ప్లాట్‌ నెంబర్‌ 164 నుండి 173 వరకు, ఫ్లాట్‌ నెంబర్‌ 193 నుండి 202 వరకు, ఫ్లాట్‌ నెంబర్‌ 21 నుండి 219 వరకు, అదే విధంగా 221 గల ప్లాట్లు సర్వే నెంబర్‌ 177 లో గల ప్లాట్లు అని చూపించి, సర్వే నెంబర్‌ 199లో గల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు అక్రమార్కులు.. బహిరంగ మార్కెట్లో కోట్ల విలువైన స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని కబ్జాకు కుయుక్తులు పన్నారు భూ ఆక్రమణదారులు.. ఇలా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి స్థానిక అధికారులు చేసిన అక్రమాలపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు..

స్థానికుల ఫిర్యాదు మేరకు నాటి మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ లెటర్‌ నెంబర్‌ ఏ1/224/2017 తేది:- 24-01-2022 గల లేఖ ద్వారా అధికారులు చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.. సర్వేనెంబర్‌ 199 లోని ప్రభుత్వ స్థలంలో సుమారు 40 ప్లాట్లు పట్టా సర్వేనెంబర్‌ 177 పేరుతో కబ్జా చేసినట్లు గుర్తించారు.. కబ్జాదారులు వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ అవినీతి అధికారులు వారి మెదడుకు పని చెప్పారు.. రికార్డులను తారూమారు చేసి, ప్రభుత్వ భూమిని ప్రైవేటుపరం చేయుటకు అక్రమార్కులతో చేతులు కలిపారు..

ఈ వ్యవహారంపై అడిషనల్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ జరిపిన నాటి రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ ఎన్‌. రవి.. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కు లెటర్‌ నెంబర్‌ ఏ/87/2022 తేది: 05-01- 2023 గల లేఖ ద్వారా స్థానిక అధికారులు చేసింది ముమ్మాటికి అక్రమమమే అని నిర్ధారించారు.. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి.. దురదృష్టం ఏమిటంటే అవినీతి చట్రం తిప్పిన అధికారులందరినీ వదిలేసి, ఒక ఏడీని అదుపులోకి తీసుకుని చేతులు దులుపుకున్నారు..

మరి వారందరి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. మరో సంచలనమైన విషయం ఏమిటంటే ఈ భారీ అవినీతి వ్యవహారం వెనకాల నాటి సి.సి.ఎల్‌.ఏ. కమిషనర్‌ ఐఏఎస్‌ ధికారి నవీన్‌ మిట్టల్‌ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తూన్నారు.. అందుకనే ఈ అక్రమ వ్యవహారాన్ని నీరుగారు స్తున్నారని వారు అంటున్నారు.. ఒక విచారణాధికారి అక్కడి అధికారులు అవినీతికి పాల్పడ్డారని తేల్చినా వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపో యింది.. ఎవరికోసం ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తు న్నారో తెలియాల్సి వుంది..

అవినీతికి పాల్పడిన అధికారు లను విచారించి, వారిని కఠినం గా శిక్షించి విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు, సామాజిక వేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.. అసలు సర్వే నెంబర్‌ 199లో ఏమి జరిగింది..? మరో సర్వే నెంబర్‌ 177 ను బూచిగా ఎలా చూపించగలిగాడు.. ప్రభుత్వ స్థలంలో 40 ప్లాట్లు ఏవిధంగా కబ్జా చేశారు..? ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చిన ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిట్టల్‌ పాత్ర ఏమిటి..? అన్న విషయాలను పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది

‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

- Advertisement -
RELATED ARTICLES

Latest News