కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఫసక్
- కాప్రా మండలంలో చక్రం తిప్పిన గవర్నమెంట్ ఆఫీసర్లు..
- గత తహశీల్దార్ తో పాటు నలుగురు అధికారులపై నమోదైన కేసు..
- భూ భారతీ చట్టం సెక్షన్ 20 ప్రకారం చర్యలు చేపట్టాలంటున్న స్థానిక ప్రజలు
- నవీన్ మిట్టల్ వేలిముద్ర మాయాజాలంతో మాయమైన ప్రభుత్వ భూములు..
- భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ సార్ ఈ అక్రమాలపై చర్యలు తీసుకోండి
- ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న పలువురు సామాజికవేత్తలు
మేము ఆధారాలతో ధైర్యంగా జరిగిన, జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకుని వస్తున్నాం.. ప్రభుత్వానికి సహకరిస్తున్నాం.. ప్రభుత్వ, ఆస్తులను రక్షించే ఉద్దేశ్యంతో ఎన్నెన్నో కథనాలను ప్రచురించి మీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చాం.. వస్తున్నాం.. కానీ మా కథనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి, పరిశీలించడానికి ఎందుకని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వెనుకంజవేస్తున్నారు..?
నిబంధనలకు అడ్డగోలుగా తూట్లు.. తెలంగాణ ల్యాండ్ ఎంక్రొచ్మెంట్ యాక్ట్ 1905 అడ్రస్ లేకుండా పోయింది.. ఒకవేళ లంచాలు తీసుకుని అవినీతి అధికారులు రికార్డులు ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టి.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన సి.సి.ఎల్.ఏ. కమిషనర్ గా పనిచేసిన నవీన్ మిట్టల్ ఇందులో భాగస్వామి అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇతగాడి అక్రమాలపై ఈడి లాంటి సంస్థలు కేసులు పెట్టినా సరే డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. ధరణిలో నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ కావాలంటే నవీన్ మిట్టల్ ఒక్కడికే ఆ అవకాశం ఉండేది..
కళ్లెదుటే ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో కనబడుతున్నా కాసులకు కక్కుర్తి పడి కబ్జాదారులు వెదజల్లే ధనానికి దాసోహమై ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు.. ఇది ముమ్మాటికి రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ కిందకే వస్తుందనేది చట్టం చెబుతుంది.. తాను రాసిందే చట్టం.. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వేలకోట్ల విలువైన ఆస్తులను కబ్జాకోర్లు కొల్లగోట్టుటకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు నవీన్ మిట్టల్.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై ప్రస్తుత కమిషనర్ లోకేష్ కుమార్ దృష్టి సారించి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
భూ భారతి చట్టంలో చాలా క్లియర్ గా అధికారులు అక్రమాలకు పాల్పడితే యాక్ట్ 1 ఆఫ్ 2025 లో గల సెక్షన్ 20 (2) ప్రకా రం చర్యలు ఉంటాయని గెజిట్లో పేర్కొన్నా దాన్ని ఖాతరు చేయడం లేదు అధికారులు.. అంతే కాకుండా సెంట్రల్ యాక్ట్ 45 ఆఫ్ 2023 ప్రకారం.. బి.ఎన్.ఎస్ యాక్ట్ క్లాజ్ (28)లోని సెక్షన్ 2 ప్రకారం అధికారులకు శిక్షలు ఉన్నాయని తెలిసికూడా ఆ ఏమవుతుందిలే” అన్న ధైర్యంతో రికార్డులు ట్యాంపరింగ్ చేశారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి..
భారత రాజ్యాంగంలో అవినీతి అధికారులకు చర్యలు చేపట్టకుండా ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా..? అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.. కాగా ఇటీవలే చౌటుప్పల్ మండలంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్నారని కొందరిని అరెస్ట్ జైలుకు పంపారు.. అయితే చౌటుప్పల్ లో ఒక్క చట్టం.. కాప్రాలో మరో చట్టం ఏమైనా ఉందా..? అక్కడ రికార్డుల ట్యాంపరింగ్ అయితే కాప్రాలో రికార్డుల ట్యాంపరింగ్ జరగింది. వాస్తవం కాదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. అసలు కబ్జాలో భాగస్వాములై రికార్డులు తారుమారు చేసిన ఎవరు ఆ ఐదుగురు అధికారులు.. ఇందులో నవీన్ మిట్టల్ పాత్ర ໖໖.. ?..
ప్రతిష్టాత్మకమైన రెవెన్యూ వ్యవస్థలో ఏమి జరిగింది.. జరుగు తోంది..? తెలంగాణ పట్టాదారు పాస్ బుక్ చట్టం 2020లో ప్రభుత్వ అధికారులు విధుల్లో ఉండి.. రికార్డులు తారుమారు చేస్తే తీసుకోబడే చర్యలు ఏంటి..? గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సీసీఎల్ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ తో పాటు, మరికొంత మంది అవినీతి అధికారులు కలసి చేసిన రికార్డులు తారుమారు వ్యవహారం, మోసపూరితమైన ఉత్తర్వులను జారీ చేసి.. చేసిన భూ స్కాములపై పక్కా ఆధారాలతో వరుస కథనాలతో తెర మీదకు తీసుకు రానుంది “ఆదాబ్ హైదరాబాద్”.. “మా అక్షరం అవినీతిపై “..అస్త్రం”..
