ప్రముఖ సినీ నటుడు, 300పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్ననవ రస నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad)కి నట ప్రపూర్ణ టిఎల్ కాంతారావు (Kantharao) స్మారక జాతీయ పురస్కారాన్ని (National Award) ఆయన 102వ జయంతి(నవంబర్ 16న) సందర్భంగా అందించనున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్ కేవీ రమణాచారి, కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 21న ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం ఉంటుందని, ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkat Reddy), ఎఫ్‌డిసి (FDC) చైర్మన్ దిల్ రాజు(Dil Raju)తో పాటు మరెందరో పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నట్లు చెప్పారు. గత 18 ఏళ్లుగా కాంతారావు జన్మదినాన్ని నవంబర్ 16న నిర్వహిస్తున్నామని, కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల నవంబర్ 21న నిర్వహించాల్సి వచ్చిందని, ఆ రోజు కాంతారావు కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
