Friday, March 27, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఏమయ్యా జీవన్ రెడ్డి సారూ..

Aaj Ki Baath | ఏమయ్యా జీవన్ రెడ్డి సారూ..

ఏమయ్యా జీవన్ రెడ్డి సారూ.. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ.. నిన్ను అక్కున చేర్చుకుని ఆదరించింది కదా.. ఎదో ఒక్కసారి జరిగినదానికి.. పార్టీని పలు రకాలుగా విమర్శిస్తావా..? పొద్దున్న లేచినదగ్గరనుండి నోరు పారేసుకుంటావా..? తొమ్మిది సార్లు బీ-ఫారం.. రెండుసార్లు ఎంపీ టికెట్.. ఎమ్మెల్సీగా సముచిత గౌరవం ఇచ్చింది పార్టీ.. ఉమ్మడి కరీంనగర్ సాక్షిగా కాంగ్రెస్ అండగా నిలిచింది నిజం కాదా? ఓడినా సరే విడువకుండా నిన్ను ఆదరించిన పార్టీని వీడటం.. రాజకీయ పరిణతి అనిపించుకోదు.. నిబంధనలను పక్కనపెట్టి మరీ నిజామాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చింది.. ఇంతకంటే పార్టీ ఇంకేం చేయాలి? దశాబ్దాల అనుబంధాన్ని తుంచుకుని మీ రాజకీయ భవిష్యత్తును మీరే ప్రశ్నార్థకం చేసుకున్నారు.. పార్టీ మిమ్మల్ని గౌరవించిన తీరును విస్మరించడం భావ్యమా? జీవన్ రెడ్డి గారూ..

- Advertisement -
RELATED ARTICLES

Latest News