పేదల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు. ఆరు గ్యారంటీ పథకాల అమలుతో తెలంగాణ స్వర్ణయుగ దిశగా పయనిస్తోందని తెలిపారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాయకత్వంలో జవహర్ నగర్ ప్రాంతానికి అత్యధికంగా ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు.

ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించడం ప్రజా పాలనపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బల్లి శ్రీనివాస్ గుప్తా, బింగి సతీష్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, యాదగిరి యాదవ్, పద్మారావు, రాజు యాదవ్, అజయ్ కుమార్, సోమేశ్ చారి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
