- మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.
: ఎమ్మెల్యే మేఘారెడ్డి..
నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు. బుధవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని ఇందిరా పార్కులో గల ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి నిరుపేదల అభ్యున్నతికి వెన్ను దన్నుగా నిలిచి ఉక్కు మహిళగా పేరుగాంచారని గుర్తు చేశారు. గరీబి హటావో అని నినందించి సీలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి భూమిలేని నిరుపేదలకు సాగు భూమిని అందించి నిరుపేదల అభ్యున్నతికి పాటుబడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

బ్యాంకులను జాతీయకరణ చేసి నిరుపేదలకు బ్యాంకు సేవలను అందుబాటులో తెచ్చారాని కొనియాడారు. హరిత విప్లవం తీసుకొచ్చి పంటలు దిగుబడి పెంచి అన్నదాతల శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తి ఇందిరాగాంధీని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ కుటుంబం పూర్తిగా ప్రజాసేవకై ప్రాణాలర్పించారని,ధీరశాలి అయిన ఇందిరా గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
