Sunday, April 26, 2026
Homeబిజినెస్Stock Market | లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు..

Stock Market | లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు..

  • మధ్యాహ్నం నుంచి లాభాల బాటలో..

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నుంచి లాభాలబాటపట్టాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 73,477.53 పాయింట్ల వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో మరింత నష్టపోయి 72,728.66 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. ఇదే సమయంలో ఇరాన్-అమెరికా మధ్య కాల్పులు విరమణ అంశంలో ప్రకటన వెలువడటం మార్కెట్ వర్గాలకు కలిసొచ్చింది. మార్కెట్ లాభాలబాట పట్టింది.

ఒక దశలో సెన్సెక్స్ 74,207.46 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 787.30 పాయింట్ల (1.07 శాతం) లాభంతో 74,106.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 255.15 పాయింట్ల (1.12 శాతం) లాభంతో 22,968.25 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సందప ఒక్క రోజే ఏకంగా రూ.5 లక్షల కోట్లు పెరిగింది. దీంతో భారతీయ మార్కెట్ల విలువ రూ.427 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రోజు కన్య్సూమర్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు దూసుకెళ్లగా, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌ షేర్లు మాత్రం భారీగా నష్టపోయాయి. ఇక, డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి 93.05గా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News