Monday, October 27, 2025
ePaper
HomeజాతీయంSIR | 12 రాష్ట్రాలు/యూటీల్లో

SIR | 12 రాష్ట్రాలు/యూటీల్లో

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ప్రకటన

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో దశను 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) అక్టోబర్ 27న ప్రకటించింది. ఆ జాబితాలో ఉన్నవి.. అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చెరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. తొలి దశను బిహార్‌లో విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఢిల్లీలో తెలిపారు. 2వ దశలో 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారు. ఈ ప్రక్రియ నవంబర్ 4న ప్రారంభం కానుంది.

ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 9న, తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తారు. ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా చేయటమే ఎస్ఐర్ లక్ష్యం (Target). 1951 నుంచి ఈ సవరణను 8 సార్లు నిర్వహించారు. చివరిసారి 2002-2004లో జరిగింది. వలసలు, నకిలీ(Fake)లు, 2002 నుంచి నమోదిత ఓటర్లు ఎవరైనా మరణించి ఉంటే ఈ కారణాలతో ఎస్ఐఆర్ నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం నిర్వహిస్తున్నది 9వ సవరణ. పౌరసత్వానికి ఆధార్ (Aadhar) ధ్రువీకరణ పత్రం కాదని, అయితే.. ఎస్ఐఆర్‌లో దాన్ని ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌(Identity Proof)గా సమర్పించొని స్పష్టం చేశారు. అస్సాంలో ఓటర్ల జాబితా సవరణను విడిగా నిర్వహిస్తామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News