HomeజాతీయంDefense Deal | అత్యాధునిక ఆయుధాల కొనుగోలు..

Defense Deal | అత్యాధునిక ఆయుధాల కొనుగోలు..

  • రూ. 5,083 కోట్ల విలువైన కాంట్రాక్టులపై సంతకాలు..
  • రష్యా అభివృద్ధి చేసిన లేటెస్ట్ ఉపరితలం క్షిపణులు..

అత్యాధునిక హెలికాప్టర్లు, ‘ష్టిల్‌’ క్షిపణుల కొనుగోలుకు సంబంధించి రూ.5,083 కోట్ల విలువైన కాంట్రాక్టులపై కేంద్రo తాజాగా సంతకాలు చేసింది. వీటి ద్వారా భారత తీర ప్రాంత రక్షణ కోసం ఆరు అత్యాధునిక తేలిక రకం హెలికాప్టర్లు ‘ఎంకే-3’, ష్టిల్‌ మిస్సైల్స్‌ను సేకరించబోతున్నది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ సమక్షంలో సంతకాలు చేసినట్టు కేంద్రం మంగళవారం పేర్కొన్నది.

దీంట్లో రూ.2,901 కోట్లు వెచ్చించి ఏఎల్‌హెచ్‌ రకం ఎంకే-3 హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది. ష్టిల్‌ క్షిపణులు రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఉపరితలం నుండి గాల్లో ప్రయోగించేవి. శత్రుదేశ విమానాలు, క్షిపణులు, మానవ రహిత వాహనాలు, హెలికాప్టర్లను ఇవి కూల్చివేయగలవు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News