Friday, March 6, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSrini Developers | భువనగిరి ప్రజలారా మీ సంపదను మీరే రక్షించుకోండి..

Srini Developers | భువనగిరి ప్రజలారా మీ సంపదను మీరే రక్షించుకోండి..

ప్రజలు, ప్రజాసంఘాలు ఇప్పటికైనా మేలుకోండి

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్‌ ని మూసేసే వరకు విశ్రమించకండి..
  • సర్వే నెంబర్‌ 322/4, చెల్లూర్‌ గ్రామం, రాజాపేట మండలంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నడుస్తున్న క్రషర్‌..
  • భారీ ఎత్తున సాగుతున్న పనులతో కలుషితం అవుతున్న పర్యావరణం..
  • ప్రశ్నార్థకంగా మారిన ప్రజల ఆరోగ్యాలు.. చోద్యం చూస్తున్న అధికారులు..
  • ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన ట్రెసా ప్రెసిడెంట్‌ కొల్లూరి శ్రీనివాస రావు..
  • ప్రజలు, ప్రజా సంఘాలు మేలుకొని అక్రమ క్రషర్‌ పై పోరాటం చేయాలని విజ్ఞప్తి..

యాదాద్రి జిల్లా, రాజాపేట మండల ప్రాంత ప్రజలారా మేలుకోండి.. మీ జీవితాలను పరిరక్షంచుకోండి.. అక్రమమంగా నడిపిస్తున్న శ్రీని డెవలపర్స్‌ స్టోన్‌ క్రషర్‌ మీ ప్రాంతం నుంచి తరలించేంతవరకు విశ్రమించకండి.. ప్రభుత్వం, ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తీసుకురండి.. యాదాద్రి భువనగిరి ప్రాంతం ఎన్నో పోరాటాలకు నెలవు అని మర్చిపోతున్నారా..? ఆ పోరాట పఠిమ మీలో సడలిపోయిందా..? ఈ ప్రాంత యువత నిర్వీర్యం అయ్యిందా..?

- Advertisement -

మీ ప్రాంతంలో ఒక అక్రమం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడంలో అర్ధం ఏమిటి..? ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు.. వారికి తగిన గుణపాఠం చెప్పండి.. మీ సత్తా ఏమిటో చూపించండి.. మీ ప్రాంతంలోని సంపదను మీరే రక్షంచుకోండి.. అలాగే ఇక్కడి ప్రజా సంఘాలు తమ కర్తవ్యాన్ని పక్కన పెట్టేశారా..? ప్రజల తరఫున పోరాటం చెయ్యాలనే బాధత్యను మరుగున పడేశారా.. రండి మేల్కోండి.. అక్రమ స్టోన్‌ క్రషర్‌ అంతు చూడండి..

సాక్షత్తూ నారసింహుడు కొలువై ఉన్న యాదాద్రి క్షత్రం నెలకొని ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, చెల్లూర్‌ గ్రామంలో అనుమతులకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున స్టోన్‌ క్రషింగ్‌ చేస్తున్నారు శ్రీని డెవలపర్స్‌ వారు.. ఈ ప్రక్రియతో ఆ ప్రాంతమంతా కాలుష్యంతో నిండిపోతోంది.. అక్కడనుంచి వస్తున్న శబ్దాలతో ఆ ప్రాంత ప్రజలకు నిద్దుర కరువైంది.. ఆరోగ్యాలు సర్వనాశనం అవుతున్నాయి.. ఇదొక ఎత్తైతే.. ప్రభుత్వ భూమిలో అనుమతులకు మించి క్రషింగ్‌ చేస్తున్నారు..

దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా కనుమరుగైపోతోంది.. ఈ క్రషర్‌ ను తొలగించాలని కొన్ని ప్రజా సంఘాలు, సామాజిక వేత్తలు ఎంతో కాలంగా ఆందోళనలు నిర్వహి స్తున్నా.. ఫలితం కనిపించడం లేదు.. ముఖ్యంగా తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ సఫరర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వెలికి తీస్తున్న ఆధారాలతో ఈ పోరాటాలు జరుగుతున్నాయి.. సంబంధిత అధికారులకు, పోలీసులకు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు సైతం ఎన్నోమార్లు ఫిర్యాదులు ఇచ్చినా స్పందన కరువైంది.. రేపు మాపు అంటూ కాలయాపన జరుగుతోంది.. కాగా ఖచ్చితంగా ఈ క్రషర్‌ పై చర్యలు గైకొంటామని డైరెక్టర్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ, హైదరాబాద్‌ వారు చెప్పడం జరిగింది..

కాగా వీ/ం శ్రీని డెవలపర్స్‌ యాజమానులైన కర్నాటి శ్రీదేవి, కర్నాటి యశ్వంత్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తులు ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్స్‌ తో సర్వే నెంబర్‌ 322/4 చెందిన రాజాపేట మండలం, చెల్లూర్‌ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో అడ్డదారిలో భారీ ౖపాసిటీ కలిగిన స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్‌ ని నెలకొలిపారు.. ఈ మిషన్‌ రోజుకి దాదాపు 20 గంటల పాటు నడుస్తుంది.. దీంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.. కాగా ఇక్కడ అక్రమంగా జరుగుతున్న స్టోన్‌ క్రషింగ్‌ వల్ల ప్రభుత్వానికి సరైన లెక్క చూపకపోవడంతో.. ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా పక్కదారి పడుతోంది..

మరీ ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి.. ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించకపోవడంతో.. ట్రెసా ప్రెసిడెంట్‌, తదితరులు జనవరి 5, 2026 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈ వ్యవహారంపై సత్వర చర్యలు గైకొని, ప్రభుత్వ ఖజానాను పదిలంగా ఉంచడంతో బాటు.. స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణ కూడా చేపట్టాలని కోరుతూ ఒక రెప్రజెంటేషన్‌ ఇస్తూ విజ్ఞప్తి చేయడం జరిగింది.. మరి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాడు..? ఎలాంటి చర్యలు చేపడతారు చూడాలి..

కాగా ఇంత జరుగుతున్నా స్థానిక రాజకీయ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు సైతం మిన్నకుండి పోవడంలో ఆంతర్యం ఏమిటి..? ఈ దారుణ వ్యవహారంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములై య్యారా..? అన్న అనుమానాలు రౖేత్తుతున్నాయి.. స్టోన్‌ క్రషర్‌ యాజమాన్యం విదిల్చిన కాసులకు కక్కుర్తిపడి మా ౖందుకులే అని ముఖం చాటేస్తున్నారా..? తిలా పాపం తలా పిడిౖడు అన్న చందాన అందరూ ఏకమై ఈ ప్రాంత ప్రజల ఉసురు పోసుకుంటున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది.. అయితే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.. ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం తగిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలియవచ్చింది..

అయితే ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న క్రషర్‌ యాజమాన్యంతో బాటు వారికి సహకరించిన అధికారులను సైతం విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.. కాగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన కాపీలను గ్రామపంచాయితీ కార్యాలయానికి, రాజాపేట మండల తహశీల్దార్‌ కి, ఆలేరు టి.జీ.ఎస్‌.పీ.డీ.సి.ఎల్‌. వారికి, డైరెక్టర్‌ మైన్స్‌ అండ్‌ జీయోలజీ, హైదరాబాద్‌ వారికి, తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వారితో బాటు మరికొందరు సంబంధిత అధికారులకు పంపినట్లు ట్రెసా తెలియజేసింది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News