Friday, March 6, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంMettuguda | మెట్టుగూడ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల పర్వం

Mettuguda | మెట్టుగూడ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల పర్వం

  • టౌన్ ప్లానింగ్‌పై ముడుపుల ఆరోపణలు
  • లాలాపేట – ఆర్యనగర్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తుల భవనాలు..
  • ఫిర్యాదులు వెల్లువెత్తినా చర్యలు శూన్యం… ‘సెట్టిల్మెంట్లే’ ప్రాధాన్యం అంటూ స్థానికుల విమర్శలు
  • అధికారులు మేల్కొంటారా..? మెట్టుగూడ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎప్పుడు..?

గ్రేటర్ హైదరా బాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరి ధిలోని మెట్టుగూడ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. మెట్టుగూడ సర్కిల్ పరిధి లోని లాలాగూడ, శాంతి నగర్, లాలాపేట, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో నిబంధనలను అతిక్ర మిస్తూ నిర్మాణాలు చేపడుతున్న ప్పటికీ అధికారులు చర్యలు తీసు కోవడంలో విఫ లమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం లాలాపేట ఆర్యనగర్ ప్రాంతంలో ఎలాంటి అను మతులు లేకుండా నాలుగు అంతస్తుల భవనం నిర్మాణం జరుగు తుండగా, మరో చోట కేవలం 150 గజాల స్థలంలోనే నిబంధన లకు విరుద్ధంగా భారీ నిర్మాణం కొనసాగుతోంది. అదేవిధంగా లాలాపేట పెద్ద నాలాను ఆనుకొని ఉన్న పాత భవనంపై మరో రెండు అంతస్తులు అదనంగా నిర్మిస్తున్న ప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

- Advertisement -

అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. టౌన్ ప్లానిం గ్ అధికారుల వద్ద భారీగా ముడుపులు తీసుకుని అక్రమ నిర్మాణాలను సెటి ల్మెంట్ చేసుకుంటు న్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అను మతులు ఉన్నప్పటికీ కూడా కొందరు అనధికారిక వ్యక్తులను సంప్రదిం చాల్సిందేనని, లేకపోతే పనులు నిలిపివేస్తారనే భయం ఉందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అదే విధంగా అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మించినప్పుడు స్థానిక నాయకులు, మీడియా వ్యక్తులు, సామాజిక కార్యకర్తల పేర్లు చెప్పి అధిక మొత్తాలను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈపరిస్థితులతో మెట్టుగూడ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ కార్యాలయం ముడుపుల కేంద్రంగా మారిందని ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత జరుగుతున్న ప్పటికీ ఉన్నతాధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మెట్టుగూడ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుం టారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉందని స్థానికులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News