- ఒకే రోజు 403 అప్పీల్ కేసులపై విచారణ చేస్తామంటూ నోటీసు జారీ చేసిన ఆర్టీఐ కమిషన్..
- అదెలా సాధ్యమంటూ హై కోర్టును ఆశ్రయించిన దరఖాస్తు దారుడు వడ్డేం శ్యాం..
- ఫిర్యాదుదారుడు తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది మహేష్ మామిండ్ల..
- సమాచార కమిషన్ జారీ చేసిన విచారణ నోటీసులు చెల్లవని మరల తేదీలు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించిన హైకోర్టు..
- ఆర్.టి.ఐ. చరిత్రలోనే ఇది సంచలన పరిణామం..
- హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు మేధావులు.. ఇకనైనా సమాచార కమిషన్ మేలుకోవాలని హితవు
సమాచార హక్కు చట్టం అనేది.. ఒక మహోన్నత ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు, జరుగుతున్న అభివృద్ధి, అధికారుల అవినీతి సామాన్యులు సైతం తెలుసుకునే వీలు కలిగింది.. అయితే కాల క్రమేణా ఆర్.టి. ఐ.కి గ్రహణంలా గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పట్టింది.. చట్టాన్ని నీరుగార్చి దరఖాస్తుదారులకు ముప్పుతిప్పల పెట్టింది..అడిగిన సమాచారం ఇవ్వడానికి నెలల తరబడి ఇవ్వకుండా తిప్పుకోవడం చేసింది.. కొన్నిచోట్ల సమాచారం లేదని.. కొన్ని చోట్ల తప్పుడు సమాచారం ఇస్తూ దరఖాస్తు దారులను నిరుత్సాహ పరిచింది.. సమాచారం అడిగిన విషయాన్ని సంబంధిత అధికారులకు, వ్యక్తులకు లీక్ చేయడం జరుగింది..దాడులు చేపించింది..దరఖాస్తు వేయాలంటే భయాన్ని సృష్టించింది..దీంతో ఒక ఉన్నత ఆశయం చేవ చచ్చిపోయింది.. గత ప్రభుత్వంలో బ్రష్టు పట్టించిన సమాచార హక్కు చట్టం ఇప్పుడు చట్టం తెచ్చిన ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో దరఖాస్తు దారుల్లో ఆశలు చిగురించాయి..మరల సమాచార హక్కు చట్టం అమలు అవుతుందని.. కానీ అందుకు బిన్నంగా ఉంటుందని తెలుసుకున్న దరఖాస్తు దారులు కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది..ఇప్పుడు హైకోర్టు న్యాయవాదులు మహేష్ మామిండ్ల, కర్నాటి వెంకట్ రెడ్డి లు వేసిన హైకోర్టు లో 403 కేసుల ఒకే రోజు విచారణ చేయడం పై వేసిన కేసుకు ఇప్పుడు హైకోర్టు సైతం గడ్డి పెట్టడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయ్యింది..
సమాచార హక్కు చట్టం అనేది ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిది.. ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా అధికారి అవినీతి అక్రమాలు చేస్తే.. అట్టి అక్రమాల చిట్టా ప్రజల తమ చేతిలోకి ఆధారాలతో సహా పొందగలిగే చట్టమే ఈ సమాచార హక్కు చట్టం.. అవినీతి పరులైన అధికారుల గుండెల్లో గుబులు పుట్టించే చట్టం.. సమాచార హక్కు చట్టం.. అలాంటి చట్టం గత ప్రభుత్వంలో బ్రష్టు పట్టి, దరఖాస్తుదారులు వేసిన దరఖాస్తులకు సమాచారం ఇవ్వకుండా దాటవేసిన దృష్టాంతాలు అనేకం చూసాం..
అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అభాసుపాలు చేసి చట్టం అంటే సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్న చందాన వ్యవహరించింది.. ప్రజా అధికారులు సైతం సమాచార హక్కు చట్టంపై సరియైన అవగాహన లేక.. వారి ఇష్టా రాజ్యంగా నడుచుకున్న దాఖలాలు గత ప్రభుత్వం లో కోకొల్లలుగా ఉన్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చట్టాన్ని నీరుగార్చి దరఖాస్తు దారులకు చుక్కలు చూపించారు.. ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం లో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందుటకు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి చూసాం..
అసలు సమాచార హక్కు చట్ట దరఖాస్తు అంటే ఏంటి..? దరఖాస్తు తీసుకున్న తర్వాత సమాచారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి..? మొదటి అప్పీల్ చేస్తే ఏం చేయాలి..? రెండవ అప్పీల్ చేస్తే ఏం చేయాలి..? అనే అవగాహన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అధికారు లకు లేకపోవడం దురదృష్ట కరం.. అలాంటి చట్టంలో గత ప్రభుత్వంలో చేసిన దరఖాస్తుల అప్పీళ్లకు ఒక్కొక్క దరఖాస్తు దారుడి పిటిషన్లు రాష్ట్ర సమాచార కమిషన్ లో కోకొల్లలుగా వచ్చి పడి ఉన్నాయి.. ఇదే తరహలో వడ్డేం శ్యామ్ అనే దరఖాస్తు దారుడు ప్రజా సమాచార అధికా రులకు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. సదరు అధి కారులు సమాచారం ఇవ్వక పోవడంతో తెలంగాణ రాష్ట్ర సమా చార కమి షన్ కార్యాల యంలో రెండవ అప్పీల్ కోసం చేసిన దరఖాస్తులు 403గా ఉన్నాయి.. ఇట్టి పిటిషన్లపై తెలం గాణ రాష్ట్ర సమాచార కమిషన్ అత్యుత్సాహం చూపించి ఒకే రోజు 403 కేసులను విచారణ జరుపుతామని నోటీసు జారీ చేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దీన్నిబట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లకు సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండి చేస్తున్నారా..? లేక చేస్తున్నారా..? అని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సమాచార చట్టాన్ని ప్రస్తుత రాష్ట్ర సమాచార కమిషనర్లు సమాచారం ఇప్పించడంలో సఫలం అవుతున్నారన్నది ప్రశ్నార్ధకమే.. అందుకు నిదర్శనమే వడ్డేం – శ్యాంకు సంబంధించిన 403 కేసులు.. ఒకే రోజు దరఖాస్తు దారుడు 403 కేసులను విచారణ జరుపు తామని జారీ చేసిన నోటీసు పై హైకోర్టును ఆశ్రయిం చాడు దరఖాస్తు దారుడు.. ఈ యొక్క వ్యవహారంపై పిటిషన్ తరపున హైకోర్టు న్యాయవాది మహేష్ 30 మామిండ్ల, కర్నాటి వెంకట్ రెడ్డిలు కలసి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ జారీ చేసిన నోటీసు పూర్తిగా చట్ట విరుద్ధమని సమాచార హక్కు చట్టం నిబంధనల ఉల్లం ఘనేనని పేర్కొన్నట్లు తెలిసింది.. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ పై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ నెంబర్ 28503/ 25. ఇట్టి కేసు విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అడ్వ కేట్ మహేష్ మామిండ్ల వాదనలు విని.. దరఖాస్తు దారుడికి 403 కేసులు ఒకే రోజు విచారణ చేయడం సరికాదని తేల్చి చెప్పింది..
మరల నోటీసులు ఇచ్చి విచారణ జరిపి దరఖా స్తు దారునికి సమాచారం ఇప్పించాలని ఆదేశాలు ఇచ్చింది.. దీనితో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నిబంధనలకు విరు ద్ధంగా వెళితే ప్రజా సమాచార అధికారులు సమాచారం ఎలా ఇస్తారు అన్నది వేచిచూడాల్సి ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పవిత్ర మైన సమాచార హక్కు చట్టాన్ని ఈ ప్రభుత్వంలో నైనా అబాసు పాలు కాకుండా పారదర్శకంగా సమాచార హక్కు చట్ట దరఖా స్తుదారులకు సమాచారం అందిలే రాష్ట్ర సమాచార కమి షన్ పునః పరిశీలన చేయాలని దరఖాస్తు దారులు డిమాండ్ చేస్తు న్నారు.. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్లో నియమి తులైన కమిషనర్లకి హైకోర్టు న్యాయవాది మహేష్ మామిండ్ల లాంటి సీనియర్ ఆర్టిఐ ఆక్టివిస్ట్, అండ్ ట్రైనర్,గతంలో చట్టాల పై అనేక అవగాహన సదస్సుల్లో గెస్ట్ గా పాల్గొని ఎంతో మందికి చట్టం పై అవగాహన కల్పించి దరఖాస్తు దారులను తయారు చేసిన మహేష్ లాంటి న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసు కొని సమాచార హక్కుచట్టంపై అవగాహన పెంపొందించుకొని దర ఖాస్తుదారులకు సమాచారం అందించేలా ప్రతి కమిషనర్ చూడా లని తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు..

