వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని ఆశా వర్కర్లకు వైద్య అధికారులు రివ్యూ నిర్వహించి, గ్రామస్థాయిలో నిర్వహించాల్సిన ఆరోగ్య కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.. గర్భిణీ స్త్రీల సంరక్షణ, ప్రసవానంతర సేవలు, శిశు టీకాల కార్యక్రమం, పోషణ కార్యక్రమాలు, వ్యాధుల నివారణ చర్యలు వంటి అంశాలపై ఆశా వర్కర్లు చురుకుగా పనిచేయాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో ఆరోగ్య సమస్యలను గుర్తించి, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -
