Friday, April 3, 2026
Homeఆదిలాబాద్Development | ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.

Development | ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.

  • ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి:
  • రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి.

ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా, ఆయన, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రాష్ట్ర ఉర్దూ ఆకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ లతో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు.

ముందుగా బాసరకు చేరుకున్న ప్రభుత్వ సలహాదారు, తదితరులకు కలెక్టర్ అభిలాష అభినవ్ పూల ముక్కలు అందించి స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు నిర్వహించే ప్రాంతం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే ప్రాంతాలు పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

- Advertisement -

అనంతరం ఆలయ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉందని అన్నారు. బాసర తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలు అన్ని అభివృద్ధిపరిస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల అరవ తేదీన ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పారు.

దేశం నలుమూలల నుంచి బాసరకు ఎంతో మంది భక్తులు వస్తారని, ఆ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా, దర్శనాలు సౌకర్యవంతంగా పూర్తయ్యేలా తగిన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బాసర పర్యటనకు అధికారులంతా సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసిల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News