Thursday, February 12, 2026
Homeబిజినెస్Price Drop | మరికొంత తగ్గిన బంగారం వెండి ధరలు

Price Drop | మరికొంత తగ్గిన బంగారం వెండి ధరలు

నవంబర్ 5: డాలర్ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్ రేట్లో కోతపై కూడా ఆశలు సన్నగిల్లుతుండటంతో బంగారం రేటు నానాటికీ పడిపోతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్ను ప్రతిఫలిస్తూ భారత్లో కూడా పసిడి ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 1,22,540గా ఉంది. నిన్నటితో పోలిస్తే సుమారు రూ.800 మేర ధరలో కోత పడింది.

ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,450 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో కూడా భారీగా కోత పడింది. కిలో వెండి ధర రూ.3200 మేర తగ్గి రూ.1,50,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బెన్స్ 24 క్యారెట్ బంగారం ధర 3,969 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్ సూచీ 0.12 శాతం మేర పెరిగి 99.99కు చేరుకుంది. గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. దీంతో, పసిడి, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఈ వారమంతా బంగారం ధరల్లో దిద్దుబాట్లు తప్పవనేది మార్కెట్ వర్గాల అంచనా.

- Advertisement -
RELATED ARTICLES

Latest News