Friday, March 6, 2026
Homeహైదరాబాద్‌Sanitation | పారిశుద్ధ్యంపై మరింత ఫోకస్ పెంచాలి

Sanitation | పారిశుద్ధ్యంపై మరింత ఫోకస్ పెంచాలి

– ఈ దిశగా ప్రజలను చైతన్యం చేయాలి
– పరిశుభ్ర నగరంగా గ్రేటర్ హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి
– వెబ్ ఎక్స్ దృశ్య మాధ్యమ సమీక్షలో జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆదేశం
– ఇప్పటివరకు అదనంగా 1458 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 547 నిర్మాణ వ్యర్థాల తరలింపు

హైదరాబాద్‌లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచడానికి జోనల్(Zonal), డిప్యూటీ కమిషనర్లు(Deputy Commissioners) ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ(Ghmc) కమిషనర్ ఆర్.వి.కర్ణన్(R.V.Karnan) ఆదేశించారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్ వెబ్ ఎక్స్ దృశ్య మాధ్యమ సమీక్ష(WebX Visual Media Review) నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం పకడ్భందీగా చేపట్టాలన్నారు.

- Advertisement -

పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు పరిశుభ్రత ప్రాధాన్యతపై ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్ర నగరంగా గ్రేటర్ హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. ఇప్పటివరకు 1458 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను, 547 నిర్మాణ వ్యర్థాలను తరలించారు. తొలి రోజు ఫుట్ ఓవర్ బ్రిడ్జి క్లీనింగ్‌తో ప్రారంభమైన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం గడిచిన ఆరు రోజుల్లో ఫ్లై ఓవర్లు, రోడ్ సైడ్లు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్లు, కర్బ్ స్టోన్లు, చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, నిర్మాణ కూల్చివేత(C&D) వ్యర్థాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.

జీహెచ్ఎంసీ పరిధి 300 వార్డుల్లో మొత్తం 1204 ఏరియాలు, పాయింట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు, పార్కుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టగా ఇప్పటివరకు అదనంగా1458 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను, 547 నిర్మాణ వ్యర్థాల తరలింపు చేపట్టారు. డ్రైవ్‌లో భాగంగా రోడ్ పక్కన సుదీర్ఘకాలంగా ఉన్న పాడైపోయిన కార్లను తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం అమలును కమిషనర్ ఆర్.వి.కర్ణన్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ క్షేత్ర స్థాయిలో ప్రభావంతంగా అమలయ్యేలా చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News