- ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ దిట్ట.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రెండు రెట్లు ఎక్కువ ఇచ్చిన కెసిఆర్.
- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి…
హామీలు అమలు చేస్తే ఎప్పుడో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారని, కోర్టు మొట్టికాయలు వేస్తే గాని తప్పని పరిస్థితులో ఎన్నికలు నిర్వహించారని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం మాజీ మంత్రి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై ప్రజలకు అసత్యపు ప్రచారాలతో, సాధ్యం కానీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటుందని కుండబద్దలు కొట్టారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రెండు రేట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీట్ మెంట్ అప్పటి కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు అందించిందని గుర్తు చేశారు.

అయినా ఉద్యోగస్తులు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలను నమ్మి కేసీఆర్ ను ఓడించి, ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. రెండేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 700 మంది రైతన్నల ఆత్మహత్యలు, 60 మంది గురుకుల విద్యార్థులు అనారోగ్యం, ఫుడ్ పాయిజన్ తో మరణాలు చెందుతుంటే ప్రభుత్వానికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు. 60 కోట్ల అప్పుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన మొదలై కెసిఆర్ దిగిపోయే నాటికి మూడు లక్షల 25 వేల కోట్లు అని పార్లమెంటులో కేంద్రమే ప్రకటించిందని తెలిపారు.
ఇది సత్యం అని తెలిసిన అవగాహన రహితంతో కాంగ్రెస్ సన్నాసులు వక్రీకరించి తెలంగాణ అప్పులపై అబద్దాపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే కెసిఆర్ పాలనకు నిదర్శనమని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, మొదటి విడత రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు అందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్ లో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వారు పదేళ్ల తెలంగాణ అభివృద్ధిని కొనియాడారని గుర్తు చేశారు.
రైతుబంధు ఇస్తారా? ఇవ్వరా?.
గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సీజన్ మొదలయ్యే లోపే రైతుబంధు ఇచ్చి ఆదుకునే వారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సీజన్లోని రైతుబంధు ఇచ్చిందని, అది కూడా గత ప్రభుత్వం ఇచ్చేంతనే ఇచ్చారు. నేడు యాసంగి సీజన్ మొదలై రైతులు నారుమడులతో సిద్ధమైన రైతులకు రైతుబంధు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు రైతుబంధు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యూరియా, బోనస్, ధాన్యం కొనుగోలు, కరెంటు కోతలతో రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందుల గురి చేస్తుంటే, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే విధంగా రెండు, మూడు విడతల్లో ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం కష్ట పడుతున్న నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, జిల్లా రైతు సమితి మాజీఅధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపిపి కృష్ణా నాయక్, చంద్రశేఖర్ నాయక్, వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్స్ పెండెం నాగన్న యాదవ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, గులాం ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
