Homeహైదరాబాద్‌Secunderabad | సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్

Secunderabad | సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్

  • డా. సామల హేమ

సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంగతాయారు ను మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డివిజన్‌కు సంబంధించిన పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లి,పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

అనంతరం శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో పర్యటించిన ఆమె వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్లను మరమ్మతులు చేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే పలు ప్రాంతాల్లో డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ శానిటేషన్ ఏఈ వినయ్‌తో శానిటేషన్ సమస్యలపై,ఏఈ వేణుతో పెండింగ్ అభివృద్ధి పనులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీఈ మాధవి,జలమండలి మేనేజర్ శ్రీనివాస్,బీఆర్‌ఎస్ నాయకులు మూర్తుజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News