Tuesday, February 17, 2026
Homeరంగారెడ్డిGundlapochampally | ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

Gundlapochampally | ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కెసిఆర్ జన్మదినం సందర్భంగా గుండ్ల పోచంపల్లి డివిజన్ కేంద్రంలో మంగళవారం బీ ఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలుఘనంగా నిర్వహించారు. డివిజన్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి, పంచిపెట్టారు. అనంతరం గుండ్ల పోచంపల్లిలోని మల్లన్న దేవాలయంలో కెసిఆర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు బతకాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మతో కెసిఆర్కు బంధం ముడిపడిందన్నారు.

తరతరాలు అన్యాయానికి గురైన తెలంగాణను ప్రత్యక్ష రాష్ట్రంగా సాధించడంతోపాటు రాష్ట్రాన్ని దేశంలో నంబర్వన్ స్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మళ్లీ కెసిఆర్ సీఎం కావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. ఆలయం వద్ద కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నేత జగన్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున అన్నదానంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముద్దుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ జగన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, హేమంత్ రెడ్డి, బాలరాజు, అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి, నాయకులు అప్పమ్మ గారి రాజగోపాల్ రెడ్డి, యాదవ సోదరులు, గ్రామ ప్రజలు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News