- అడ్డగుట్ట, లాలాగూడలో ఘనంగా కేసీఆర్ 59వ జన్మదిన వేడుకలు
మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి అనితర సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి పరిపాలనలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఘన చరిత్ర కలిగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన అభిమానులు శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఈ శుభసందర్భంగా మంగళవారం నాడు జరిగిన కేసీఆర్ 59వ జన్మదిన వేడుకలు తుకారాం గేట్ చౌరస్తా,శాంతి నగర్ వాటర్ ట్యాంక్,ఇందిరా నగర్ కాలనీలలో శ్రేణులు అభిమానులు టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

అడ్డగుట్ట మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు,స్వీట్లు పంపిణీ చేశారు.ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ నాయకత్వం చరిత్రాత్మకమని,రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలులో ఆయన దూరదృష్టి ప్రశంసనీయమని పేర్కొన్నారు.ప్రజాసంక్షేమానికి ఆయన చేసిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని,ఆయన ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో వందేళ్లకు ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బి.అర్.ఎస్ నాయకులు లింగాని శ్రీనివాస్, నక్క మధు, మనోహర్,సత్తయ్య గౌడ్, పాలకూర శ్రీనివాస్ గౌడ్,దాసరి శ్రీనివాస్,వసంత,పొన్నాల రాజు,ఎల్లయ్యా,మహమ్మద్,ఇస్మాయిల్,మల్లేష్,అమర్,దేవయ్య,నర్సింగ్ రావు,అల్లా బక్షూ,గోనె, హాశం, వెంకటేష్, అయోధ్య,సంతోష్, రామస్వామి, మహేందర్,రవి, రాజు,గోపి,రామప్ప,నరేష్,చిన్న,సుధాకర్,శివకుమార్,మహేశ్వరి,భాగ్య,రజినీ,విజయ,విమల,తదితరులు పాల్గొన్నారు.
