బంగ్లాదేశ్ మాజీ ప్రధాని(Bangladesh Former PM) ఖలీదా జియా ఆరోగ్యం విషమంగా ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(Bangladesh Nationalist Party-BNP) సీనియర్ నేత ఈ విషయాన్ని వెల్లడించారు. బీఎన్‌పీ చైర్‌పర్సన్ (BNP Chairperson) అయిన ఆమె.. ఛాతీలో ఇన్ఫెక్షన్ (Infection) నేపథ్యంలో నవంబర్ 23న ఆసుపత్రిలో చేరారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఖలిదా జియా గుండె(Heart), ఊపిరితిత్తుల(Lungs)పై ప్రభావం పడింది.
దీంతో.. హాస్పిటల్‌లో చేరిన ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఆసుపత్రిలో చేరిన నాలుగు రోజుల తర్వాత ఖలీదా జియాను కరోనరీ కేర్ యూనిట్‌లోకి మార్చారు. ఆమె ఆరోగ్య సమస్యలు చాలా వరకు తీవ్రమవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్యం కోసం విదేశాలకు తరలించాలని డాక్టర్లు సూచించినప్పటికీ ప్రస్తుతం ఆమె పరిస్థితి ప్రయాణానికి సహకరించట్లేదని బీఎన్‌పీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ చెప్పారు.
