తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో మొట్టమొదటి జెన్ జెడ్ థీమ్(First Gen Z Theme) పోస్టాఫీసు అందుబాటులోకి వచ్చింది. హనుమకొండ (Hanamkonda)లోని వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్(Warangal NIT Campus)లో ఈ తపాలా కార్యాలయాన్ని హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఈ పోస్టాఫీసును నిట్ డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సబూధి చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు మోడ్రన్ అండ్ ఫాస్ట్ సర్వీసులు(Modern And Fast Services) అందించేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు.
ఇక్కడ.. బ్యాంకింగ్, పార్సిల్ బుకింగ్, క్యూఆర్ బేస్డ్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, ఆధార్ తదితర సేవలు లభిస్తాయి. స్టూడెంట్స్‌కి తక్కువ రేట్‌కి స్పీడ్ పోస్ట్, ఫ్రీ వైఫై వంటి వినూత్న సర్వీసులు అందిస్తారు. వీటిపై ప్రొఫెసర్లకు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులకు, ఉద్యోగుల పిల్లలకు అవగాహన కల్పించారు. యువ వినియోగదారులకు.. ముఖ్యంగా.. క్యాంపస్ కమ్యూనిటీకి పోస్టల్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ఆకర్షణీయంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
