Friday, February 13, 2026
Homeఅంతర్జాతీయంMyanmar | మయన్మార్‌లో చివరి దశ ఎన్నికలు

Myanmar | మయన్మార్‌లో చివరి దశ ఎన్నికలు

మయన్మార్ జనరల్ ఎన్నికల్లో(General Elections) ఇవాళ చివరి దశ పోలింగ్ జరుగుతోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ ఎలక్షన్‌లో సైనిక పాలకులు(Army Rulers), వారి మిత్రులు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావాల్సిన పార్లమెంటరీ మెజారిటీని పొందుతాయనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా గానీ న్యాయంగా గానీ జరగడం లేదని విమర్శకులు అంటున్నారు. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ(Aung San Suu Kyi) నాయకత్వంలోని ఎన్నికైన పౌర ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత సైన్యం చేపట్టిన అధికారాన్ని చట్టబద్ధం చేయడానికి వీలుగా ఈ ఎన్నికలను ఏర్పాటుచేసిన్లు ఉందని ఆరోపిస్తున్నారు. సైన్యం మద్దతు ఉన్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ లేదా USDP మొదటి రెండు రౌండ్ల ఓటింగ్‌లో పోటీ చేసిన చాలా సీట్లను ఇప్పటికే గెలుచుకుంది. జాతీయ పార్లమెంటు ఎగువ మరియు దిగువ సభల్లో 25 శాతం సీట్లను సైన్యానికి రిజర్వ్ చేశారు. దీంతో సైన్యం, దాని మిత్ర పక్షాలకు చట్టసభపై నియంత్రణ లభిస్తుంది. ప్రస్తుత సైనిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్.. కొత్త పార్లమెంట్ సమావేశమైనప్పుడు అధ్యక్ష పదవిని చేపట్టాలని మద్దతుదారులు, వ్యతిరేకులు విస్తృతంగా భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News