హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ దశాబ్ద పాలన తెలంగాణ రైతులకు స్వర్ణయుగంగా నిలిచిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కారణంగా తొమ్మిదేళ్ల కాలంలో రైతుల ఆత్మహత్యలు 95 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, రైతుబంధు, ప్రభుత్వం ద్వారా పంట కొనుగోలు, రుణమాఫీలు, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు రైతుల కుటుంబాల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చాయని కేటీఆర్(KTR) పేర్కొన్నారు.
అయితే, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పాలనలో కేవలం రెండేళ్లలోనే పరిస్థితి దారుణంగా తయారైంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతులు మరో వంద సంవత్సరాల పాటు ప్రశాంతంగా బ్రతకాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలి,” అని కేటీఆర్ అన్నారు.
మరిన్ని వార్తలు :