Tuesday, March 3, 2026
Homeకరీంనగర్Padi Kaushik Reddy | రైతులను ఆదుకోవాలి

Padi Kaushik Reddy | రైతులను ఆదుకోవాలి

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వరి పంటకు 25000, పత్తి పంటకు 50,000
నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్
కంటితుడుపు చర్యలు వద్దని సూచన

మొంతా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే (Huzurabad MLA) పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గంలో వర్షానికి పంట నష్టం జరిగిన గ్రామాల్లో పర్యటించి రైతుల(Farmers)ను పరామర్శించారు. అకాల వర్షం (Rains) అన్నదాతలను ఆగం చేస్తుంటే కన్నీళ్లు తూడువాల్సినవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు కంటి తుడుపు చర్యలుగా నష్టపరిహారం (Compensation) అనడం రైతులపై సీఎం(CM Revanth)కి, ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. నియోజకవర్గంలోని 30 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం (Cross Loss) జరిగినట్లు ప్రాథమిక అంచనా అని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. అధికారులు (Officers) మాత్రం ఈ నియోజకవర్గంలో 825 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలు (Reports) అందించడం దారుణం. ప్రభుత్వం ఈ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయిలో విచారణ (Field Level Enquiry) జరిపి అర్హులైన రైతులందరికీ కష్టపరిహారం అందించే వరకు పోరాటం చేస్తానని హెచ్చరించారు. వరి పంటకు 25000, పత్తి (Cotton) పంటకు 50,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ (Demond) చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News