కాలం చెల్లిన మందుల పంపిణీ
కానరాని అత్యవసర మందులు
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు
హైదరాబాద్‌లోని రసూల్‌పురా బస్తీ దవాఖాన(Basti Dawakhana)లో దారుణం చోటుచేసుకుంది. కాలం చెల్లిన (Expired) మందులు పంపిణీ చేస్తున్నారు. బస్తీ దవాఖానలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నా ప్రజారోగ్య శాఖ పట్టించుకోవట్లేదు. గుర్రుపెట్టి నిద్రపోతోంది. దీంతో.. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission)కి ఫిర్యాదు చేశారు.

కాలం చెల్లిన మందుల పంపిణీని వెంటనే నిలిపివేసి, అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచేలా తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్‌ను ఆదేశించాలని కోరారు. కాలం చెల్లిన మందులను పంపిణీ చేసిన వైద్య అధికారులు, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. సంబంధిత డైరీ నంబర్ (24923/IN/2025) ఇచ్చింది.
