Homeస్పోర్ట్స్Donation | పోలీసు సంక్షేమ నిధికి రూ.8 లక్షలు

Donation | పోలీసు సంక్షేమ నిధికి రూ.8 లక్షలు

విరాళంగా ఇచ్చిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నీ విన్నర్, రన్నర్ టీమ్స్

హైదరాబాద్: ఛామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌ను పోలీస్ క్రికెట్ టీం గెలుపొందింది. అక్టోబర్ 9, 10 తేదీల్లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Rajiv Gandhi International Cricket Stadium)లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో టాలీవుడ్ (Bollywood) టీంపై పోలీస్ క్రికెట్ టీం విజయం సాధించింది. విన్నర్ టీమ్‌కు లభించిన రూ.5 లక్షలు, రన్నర్ టీమ్‌కు లభించిన రూ.3 లక్షల బహుమతిని పోలీసు అమర వీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని పోలీసు సంక్షేమ నిధికి అందచేశారు.

- Advertisement -
donation2

సంబంధిత చెక్కును నిర్వాహకులు రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ సీవీ ఆనంద్‌(CV Anand)కు సచివాలయం(Secretariat)లో మంగళవారం అందచేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ క్రికెట్ టీమ్ సభ్యులతో పాటు బీసీసీఐ, ప్రణవ గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News