ఏపీలోని కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ.. పరీక్ష ఫలితాల(Exam Results)ను వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp Governance)లో విడుదల చేయబోతోంది. విద్యార్థులకు మన మిత్ర(Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సెమిస్టర్(Semister) ఫలితాలను అందుబాటులోకి తెస్తోంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న మొట్టమొదటి యూనివర్సిటీ(First University)గా ద్రవిడ యూనివర్సిటీ నిలవనుంది. 2026 జనవరి 2న ఉదయం 10 గంటలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు సెమిస్టర్ పరీక్ష ఫలితాల కోసం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలు తెలుసుకోవాలని సూచించారు.

