వెర్సటైల్ యాక్టర్ తిరువీర్(Tiruveer), టీనా శ్రావ్య (Teena Shravya) జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు (Posters) సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం.

అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్‌ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్‌ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. కానీ ఇంకా ఆల్బమ్ రాలేదు (నవ్వుతూ). ట్రైలర్ బాగుంది. సినిమా మరింత బాగుంటుందని ఆశిస్తున్నాను. సిట్యువేషనల్ కామెడీతో రానున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. తిరువీర్‌కు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ .. ‘తిరువీర్ గారి వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. రోహన్ ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. నాకు సురేష్ బొబ్బిలి మంచి స్నేహితుడు. ఆయనకు మరిన్ని విజయాలు దక్కాలి. సురేష్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని అనుకుంటున్నాను. తిరువీర్ గారు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని.

హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కోసం ఇంత మంది దర్శకులు వచ్చారు. నేను ఇంత మంది మంచి ఫ్రెండ్స్‌ను దర్శకుల రూపంలో సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం.
చిత్ర నిర్మాత సందీప్ అగరం మాట్లాడు తూ.. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈవెంట్‌కు వచ్చిన దర్శకులందరికీ థాంక్స్. మా హీరో తిరువీర్ ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇంత మంచి దర్శకులంతా కూడా మా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మేం ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మూవీని చేశాం. మా టీం అందరికీ థాంక్స్. నవంబర్ 7న థియేటర్లోకి రాబోతోంది. మంచి కంటెంట్‌తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
నటి యామిని మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఇదే నాకు తొలి చిత్రం. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు రాహుల్ గారికి, నిర్మాతలకు థాంక్స్. సోమ శేఖర్ గారి కెమెరా వర్క్ బాగుంటుంది.
