Tuesday, February 10, 2026
Homeక్రైమ్ వార్తలుPolice | యూనిఫామ్‌లో పోలీస్ రొమాంటిక్ రీల్

Police | యూనిఫామ్‌లో పోలీస్ రొమాంటిక్ రీల్

అతనో ఎస్ఐ(SI). నిన్న రిపబ్లిక్ డే(Republic Day). ఆ రెండు విషయాలూ మర్చిపోవటమే కాకుండా యూనిఫామ్‌(Uniform)లో ఉండి తన భార్యతో ఏకంగా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో(police station premises)నే రొమాంటిక్ రీల్(Romantic Reel) చేశాడు. తన తల మీద ఉండాల్సిన టోపీని తీసి భార్య తల మీద పెట్టాడు. ఒళ్లు మర్చిపోయి డ్యాన్స్ (Dance) కూడా చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వాళ్లు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. యూనిఫామ్‌ను దుర్వినియోగం చేయటంతోపాటు ప్రభుత్వ కార్యాలయంలో అసభ్యంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. విచారణ నివేదిక రాగానే అతనిపై చర్యలు తీసుకుంటామని పైఅధికారులు చెప్పారు. నిందితుడి పేరు సోను చౌదరి. జార్ఖండ్‌(Jharkhand)లోని హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News